అంతా మీరే చేశారంటే ఎలా..?

- పాలసీ రేట్ల పెంపు మాత్రమే వృద్ధి తగ్గడానికి కారణం కాదు
- రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
ముంబై, జూలై 17 : దేశంలో ఆర్థిక వృద్ధి రేటుతో పాటు పెట్టుబడులు తగ్గడానికి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపే కారణమని అనడం సరికాదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అంటున్నారు. వృద్ధి మందగించడానికి కారణమైన అనేక సమస్యల్లో పాలసీ రేట్ల పెంపు ఒకటని ఆయన చెప్పారు. దేశంలో వడ్డీ రేట్లను బట్టి పెట్టుబడుల ట్రెండ్ ఎలా కొనసాగిందనే విషయం లో సమక్షిగమైన నివేదికను రూపొందించాల్సిందిగా పరిశోధన విభాగాన్ని కోరినట్లు ఆరవ స్టాటిస్టిక్స్ డే కాన్ఫన్స్‌లో పాల్గొన్న దువ్వూరి తెలిపారు. మరికొన్ని నెలల్లో ఈ రిపోర్టును బహిర్గతం చేస్తామని చెప్పారు. ఇంకా గరిష్ఠ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంవూతించడంలో భాగంగా జూన్ 18న జరిగిన పరపతి సమీక్షలో రెపో రేటును యథాతథంగా ఉంచడంపై ప్రభుత్వ, పారిక్షిశామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జూన్ నెలకు ద్రవ్యోల్బణం 7.25 శాతానికి తగ్గడంతో ఇకనైనా వడ్డీ రేట్లు తగ్గించాలని ఇండస్ట్రీ గట్టిగా కోరుతున్నది. ఈ నెల 31న జరిగే పరతిపతి సమీక్షలోనైనా వడ్డీ రేట్లు తగ్గుతాయన్న పారిక్షిశామిక వర్గాల ఆశలపై దువ్వూరి నీళ్లు చల్లేశారు. గత నెల ద్రవ్యోల్బణ గణాంకాలపై స్పందిస్తూ టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉందని అన్నారు.
ద్రవ్యోల్బణం, జాతీయ ఆదాయం, వృద్ధి రేటును గణిం చే పద్ధతులపైనా అనుమానాలు వ్యక్తపర్చారు. వీటిని సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధరల సూచీ రెండంకెల స్థాయికి చేరుకోవడంతో మార్చి 2010 నుంచి అక్టోబర్ 2011 మధ్యకాలంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను 13 సార్లు పెంచింది. దీంతో రెపో రేటు 3.75 శాతం పెరిగింది. పెట్టుబడులు తగ్గి పారిక్షిశామికోత్పత్తి పూర్తిగా కుంటుపడటంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి రేటు తొమ్మిదేళ్ల కనిష్ఠ స్థాయి 6.5 శాతానికి తగ్గడానికి ముఖ్య కారణం ఆర్‌బీఐ వరుసగా వడ్డీ రేట్లు పెంచడమేనంటూ దేశ పారిక్షిశామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులే ఇందుకు కారణమని ఆర్‌బీఐ అంటున్నది. సాధారణ స్థాయి ధరలతో మంచి వృద్ధి రేటు సాధించడం ఇప్పటికీ ప్రధాన సవాలుగానే మిగిలిపోయిందన్నారు.

ఉత్పత్తిదారుల ధరల సూచీ ప్రవేశపెట్టాలి..
దేశంలో ఆర్థిక వృద్ధికి అసలైన సంకేతం ఉత్పత్తి సామర్థ్యమేనని ఆర్‌బీఐ గవర్నర్ అంటున్నారు. 2008కి ముందు 8.5 శాతంగా ఉన్న ఉత్పత్తి వృద్ధి రేటు ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత 8 శాతానికి పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం ఉత్పతుల వృద్ధి 7.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. ప్రస్తుత టోకు ధరల సూచీ (డబ్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టడం లేదని, ఇందులో టోకు ధరలతో పాటు కొన్ని రంగాలకు సంబంధించి వినియోగదారుడి ధరలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉత్పత్తిదారుల ధరల సూచీని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ద్రవ్యోల్బణం అంశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇరవై ఏళ్ల క్రితం నా జుట్టు వత్తుగా ఉన్నప్పుడు క్షవరానికి రూ.25 చెల్లించేవాడిని. జుట్టంతా రాలిపోయి పలుచగా అయిన టైంలో హెయిర్ కటింగ్‌కు రూ.50 చెల్లించా. ఇప్పుడు కత్తిరించడానికి ఏం లేకుండా పోయిన సమయంలో రూ.150 చెల్లిస్తున్నా. ఇందులో ధరల పెరుగుదల ప్రభావం ఎంతో, లేని జుట్టును కత్తిరిస్తున్నందుకు గవర్నర్ హోదాలో లాభంగా ఎంతిస్తున్నానో నిర్ధారణకు రాలేకపోతున్నాను. - ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
Other Articles