Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 
కింగ్‌ఫిషర్‌పై కోర్టుకెక్కిన జీవీకే

kingfisher
ముంబై, జూన్ 23: కష్టాల రన్‌వేపై ఒడిదుడుకుల ప్రయాణం చేస్తున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు తాజాగా మరో కష్టమొచ్చింది. సంస్థ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో మౌలిక రంగ సంస్థ జీవీకే కోర్టుకెక్కింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్)కు యూబీ గ్రూపు అధినేత విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.60 కోట్లు బకాయి పడింది. ముంబై విమానాక్షిశయాన్ని నిర్మించడంతో పాటు నిర్వహిస్తున్న జీవీకేకు గతేడాది కాలంగా కింగ్‌ఫిషర్ పార్కింగ్, ల్యాండింగ్, నేవిగేషన్ చార్జీలను చెల్లించలేదు. బకాయిల చెల్లింపు కోసం రూ.30 కోట్లకు కింగ్‌ఫిషర్ చెక్కులు జారీ చేసింది. దీంట్లో రూ.5 కోట్ల విలువైన చెక్కు బౌన్స్ కావడంతో ఎంఐఏఎల్ గతవారం ముంబై సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసినట్లుగా తెలుస్తున్నది.

కింగ్‌ఫిషర్‌కు మరిన్ని రుణాలు?
అప్పుల ఊబిలో ఇరుక్కున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ఆదుకోవడానికి ప్రధాన బ్యాంక్‌లు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే భారీగా రుణాలు ఇచ్చి వసూళ్లు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పలు బ్యాంక్‌లు మరోసారి రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు ప్రధాన కారణం ఈ గ్రూపు నిర్వహిస్తున్న లిక్కర్ బిజినెస్. గడిచిన కొద్ది సంవత్సరాలుగా లిక్కర్ వ్యాపారం భారీ వృద్ధిని నమోదుచేసుకోవడంతో కింగ్‌ఫిషర్‌కు రుణాలు ఇవ్వడంపై వచ్చే వారంలో ప్రధాన బ్యాంక్‌ల ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి అన్నారు. విజయ్ మాల్యా నడిపిస్తున్న ఆల్కహాల్ వ్యాపారం భారీ వృద్ధిని నమోదుచేసుకుంటుండటంతో రుణాల కోసం ఇతరుల దగ్గర వెంపర్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆర్థం కావడం లేదని చౌదరీ చెప్పారు. గతంలో ఇచ్చిన రుణాలపై చౌదరీ స్పందిస్తూ ఇది చాలా క్లిష్టమైన ప్రశ్నని, ఎంత కాలం పడుతుందో తెలిసే అవకాశాలు లేవన్నారు. 18 బ్యాంక్‌లు కన్సార్షియం కింగ్‌ఫిషర్‌కు రుణాలు అందించగా, వీటిలో 14 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు కావడం విశేషం.

అన్నా బాటలో ఎయిర్ ఇండియా పైలట్లు
గడిచిన 47 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ యాజమాన్యం గాని కేంద్ర ప్రభుత్వం గాని దిగిరాకపోవడంతో ఎయిర్ ఇండియాకు చెందిన ఇండియన్ పైలట్స్ గిల్డ్ (ఐపీజీ) యూనియన్ పైలట్లు అన్నా హజారే బాటప నిర్ణయించుకున్నారు. నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా ఈ మధ్య నిరాహార దీక్ష చేశారు. యూనియన్‌కు చెందిన 8 మంది సభ్యులు ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహారదీక్ష చేపట్టనున్నారని ఐపీజీ కమిటీ మెంబర్ రోహిత్ కపాహీ తెలిపారు. వీరికి మద్దతు తెలిపేందుకు కుంటుబ సభ్యులతో సహా కలిసి నిరాహార దీక్ష ప్రాంతానికి రానున్నట్లు చెప్పారు. మేము కూడా ఈ సమస్య వీలైనంత త్వరగా ముగియాలని కోరుకుంటున్నాం. కాని యాజమాన్యం ఉద్యోగంలోంచి తొలగించిన 101 మంది పైలట్లను తిరిగి తీసుకునే వరకు మాత్రం విధుల్లో చేరే ప్రసక్తి లేదన్నారు. లక్షల్లో జీతాలు అందుకునే పైలట్లు ఈ తరహా దీక్షకు దిగటం దేశంలో తొలి సంఘటన కానుంది. బోయింగ్ -787 డ్రీమ్‌లైనర్ విమాన శిక్షణ విషయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా పైలట్ల మధ్య తలెత్తిన వివాదంతో మొదలైన సమ్మె చాలా మలుపులు తిరిగింది. సమ్మె చేస్తున్న 400కు పైగా ఐపీజీ పైలట్లలో వందమంది పైలట్లను మేనేజ్‌మెంట్ ఉద్యోగంలోంచి తీసేసింది. డిమాండ్లు పరిష్కారం కావాలంటే ముందుగా విధుల్లో చేరండని ఇప్పటికే పలుమార్లు పౌరవిమానయాన మంత్రి అజిత్ సింగ్ పైలట్లను కోరారు. కాని ఇరు వర్గాలు మెట్టు దిగట్లేదు

Other Articles
Most Viewed galleries
Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine