ఈ లంచ్ చాలా కాస్ట్‌లీ గురూ..
-వారెన్ బఫెట్‌తో విందుకు రూ.19 కోట్ల బిడ్డింగ్
న్యూయార్క్, జూన్ 9 : ఎంత ఖరీదైన హోటళ్లో భోజనమైనా మహా అం వేలల్లో ఖర్చవుతుంది. కాని ప్రపంచ స్టాక్ మాంత్రికుడు , ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరుగాంచిన వారెన్ బఫెట్‌తో భోజనం చేసేందుకు ఇంకా వివరాలు వెలుగులోకి రాని వ్యక్తి కోట్లల్లో ఖర్చు చేయబోతున్నాడు. అది కూడా ఎంతో తెలుసా.. రూ.19 కోట్లకు పైమాటే. తనతో పాటు మరో ఏడుగురు స్నేహితులతో కలిసి మాన్‌హట్టన్‌లోని స్మిత్ అండ్ వొల్లెన్‌స్కీ స్టీక్‌లో బఫెట్‌తో కలిసి లంచ్ చేసేందుకు 34,56, 789 డాలర్ల ( ప్రస్తుత మారకం రేటు ప్రకారం రూ.19,14,75,000)కు ఆన్‌లైన్ వేలంపాటలో బి డ్ చేశాడు. గతేడాది బిడ్డింగ్‌లో బఫెట్‌తో లంచ్ చేసేందుకు టెడ్ వెస్‌చ్లర్ అనే వ్యక్తి 2.63 మిలియన్లు వెచ్చించాడు. ఆ తర్వాత వెస్‌చ్లర్‌కు బఫెట్ తన కంపెనీ బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన వేలంలో పదిమంది వ్యక్తులు 106 బిడ్లు దాఖలు చేశారు. ఐదు రోజులపాటు జరిగిన వేలంపాట శుక్రవారంతో ముగిసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. 2011లో కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి 8 బిడ్లు దాఖలు చేశారు. వేలంపాట ద్వారా వచ్చిన నిధులు శాన్‌వూఫాన్సిస్కోకు చెందిన గ్లైడ్ అనే స్వంచ్ఛంద సంస్థకు వెళతాయి. ఈ సంస్థ పేదలకు ఆహారం, ఇళ్లు, వైద్యంపై నిధులను ఖర్చు చేస్తుంది. ఇప్పటి వరకు 12 వేలంపాటల ద్వారా 1.15 కోట్ల డాలర్ల నిధులు సమకూరాయి.
Other Articles